*రఘునాథపల్లిలో కోర్ సీడ్ క్షేత్ర పరిశీలన*
*పత్తి రైతుకు కాసుల పంట – చెట్టు నిండా కాయలే కాయలు!*
*ఒక్క చెట్టుకు 50-60 కాయలు – కోర్ సీడ్ ‘బాలు’తో రైతు బడితే బీరయ్య సక్సెస్ స్టోరీ*
జనగామ జిల్లా ప్రతినిధి (రఘునాథపల్లి), సెప్టెంబర్ 30 (ప్రజావాణి):
పత్తి సాగు లాభసాటి కాదనుకునే రోజుల్లో రఘునాథపల్లి మండల రైతు లాభాల పంట పండించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
మండలానికి చెందిన ప్రగతిశీల రైతు బడితే బీరయ్య తన పొలంలో కోర్ సీడ్ కంపెనీకి చెందిన బాలు రకం పత్తి విత్తనాలు వేశారు. ప్రస్తుతం పంట చూస్తే కనువిందు చేస్తోంది. ప్రతి మొక్క ఏపుగా పెరిగి ఒక్కో చెట్టుకు 50 నుండి 60 కాయలు కాసి,పూత, కాయలతో అధిక దిగుబడికి సంకేతాలు ఇస్తోందని. దీంతో చుట్టుపక్కల రైతులు ఆ పొలాన్ని చూడటానికి తరలివస్తున్నారు.
*క్షేత్ర పరిశీలనలో ప్రశంసల వెల్లువ..*
రైతు విజయగాథ తెలుసుకున్న కోర్ సీడ్ సేల్స్ ఆఫీసర్ దుస్సా భాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం క్షేత్ర పరిశీలన నిర్వహించారు. ఈ క్షేత్రాన్ని రఘునాథపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ప్రొప్రైటర్ పల్లె రవీందర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలు రకం పత్తి విత్తనం తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుందని, వాతావరణాన్ని కూడా తట్టుకుని అధిక దిగుబడి ఇస్తుందని, ఇది రైతులకు వరంలాంటిదని కొనియాడారు.
*రైతుల్లో కొత్త ఆశ..*

బడితే బీరయ్య పొలంలో వచ్చిన దిగుబడి చూసి రానున్న సీజన్‌లో తాము కూడా కోర్ సీడ్ బాలు రకమే వేస్తామని పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి ఉపసర్పంచ్ దవరా యాకయ్య, రైతులు, కోర్ సీడ్ కంపెనీ ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.