రంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే పెయింటింగ్ పనులు చేపట్టాలి
*రంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే పెయింటింగ్ పనులు చేపట్టాలి* *రెండేళ్లుగా నిల్వ ఉన్న పెయింట్ డబ్బాలను వినియోగించాలని సర్పంచ్ విజ్ఞప్తి* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్, సెప్టెంబర్ 19:(ప్రజా వాణి ) రంగాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల భవనాలకు రంగులు వేయేందుకు తెచ్చిన పెయింట్ డబ్బాలు దాదాపు రెండేళ్లుగా నిల్వ ఉన్నాయని గ్రామ సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ తెలిపారు. పాఠశాల భవనాలకు ఇప్పటివరకు రంగులు వేయకపోవడంతో గోడలు పాతబడి, భవనాల రూపురేఖలు దెబ్బతింటున్నాయని ఆయన పేర్కొన్నారు....