రంగసముద్రం పంచాయతీలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ ప్రత్యేక చర్యలు: అక్రమ ప్లాట్ల విక్రయదారులపై కఠిన హెచ్చరికలు
పోరుమామిళ్ల సెప్టెంబర్ 01 ప్రజావాణి మండల పరిధిలోని రంగసముద్రం గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం రెవెన్యూ అధికారులు విస్తృతమైన చర్యలు చేపట్టారు.రంగసముద్రం గ్రామంలోని సర్వే నంబర్ 1174/2 కు చెందిన 5 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు,సర్వే నంబర్ 1306/1 లోని 5 ఎకరాలు,మరియు పంచాయతీ పరిధిలో ఉన్న పలు ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా లేఅవుట్లు (ప్లాట్లు) వేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోరుమామిళ్ల తహసిల్దార్ కర్నాటి విజయ్ కుమార్(ఎమ్మార్వో)...