రంగసముద్రం జగనన్న లేఅవుట్‌లో అక్రమాల కలకలం: అర్హులకు మొండిచేయి.. అనర్హులకు ప్లాట్లు?
పోరుమామిళ్ల వైఎస్సార్ జిల్లా సెప్టెంబర్ 26 ప్రజావాణి మండలం రంగసముద్రం గ్రామ సచివాలయం పరిధిలోని జగనన్న లేఅవుట్‌లో అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా సాగుతున్నాయంటూ స్థానికులు, నిరుపేద లబ్ధిదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అసలైన లబ్ధిదారుల హక్కులను కాలరాస్తూ కొందరు అక్రమార్కులు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా? రంగసముద్రం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1263లో నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఒకటిన్నర సెంటు చొప్పున ప్లాట్లను కేటాయించింది....