prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 12:54 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రంగసముద్రంలో ఘనంగా మన్ కీ బాత్ కార్యక్రమం

పోరుమామిళ్ల:సెప్టెంబర్ 27ప్రజావాణి రంగసముద్రం పంచాయతీలో మండల ప్రధాన కార్యదర్శి దూళ్ల శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వీక్షించారు.ఈ సందర్భంగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, వికసిత్ భారత్–2047 లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.పోరుమామిళ్ల బీజేపీ మండల అధ్యక్షుడు నాగేంద్ర పాల్గొనగా, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ధనలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో బద్వేల్ AMC చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ, జిల్లా అధికార ప్రతినిధి నారోజు రమణ చారి, కార్యదర్శి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు చెన్నయ్య, బ్రహ్మయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తమ్మిశెట్టి రమణ, జనసేన మండల నాయకుడు నాగిరి రమణ, మండల బీజేపీ కార్యదర్శి ఈశ్వరమ్మ, కందుకూరి చెన్నయ్య దంపతులు, యువ నాయకుడు మంగళగిరి భారత్, గురివిరెడ్డి, చెన్నారెడ్డి, బ్రహ్మారెడ్డి, శ్రీలక్ష్మి, రాజేశ్వరి, సునీత, సిద్ధారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.