రంగంలోకి డీఎస్పీ..ఇళ్ల చోరీలపై ముమ్మరంగా దర్యాప్తు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి మర్రిగూడ శివన్నగూడెం, ఖుబక్ష్‌పల్లి గ్రామాల్లో కలకలం రేపిన చోరీల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరం జరిగిన ప్రాంతాలను దేవరకొండ డీఎస్పీ ఎంవీ శ్రీనివాస రావు స్వయంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు సమాచారంతో 3 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్నట్లు ఇవి 'వరుస చోరీలు' కావని, ఒకే రోజు జరిగిన ఘటనలను మర్రిగూడ ఎస్‌ఐ రాంబాబు స్పష్టం చేశారు. బాధితులు అందుబాటులో లేకపోవడం వల్లే ఫిర్యాదులు అందాయని, ప్రజలు...