prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 9:31 am Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

రంగంలోకి డీఎస్పీ..ఇళ్ల చోరీలపై ముమ్మరంగా దర్యాప్తు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

మర్రిగూడ శివన్నగూడెం, ఖుబక్ష్‌పల్లి గ్రామాల్లో కలకలం రేపిన చోరీల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరం జరిగిన ప్రాంతాలను దేవరకొండ డీఎస్పీ ఎంవీ శ్రీనివాస రావు స్వయంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు సమాచారంతో 3 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్నట్లు ఇవి ‘వరుస చోరీలు’ కావని, ఒకే రోజు జరిగిన ఘటనలను మర్రిగూడ ఎస్‌ఐ రాంబాబు స్పష్టం చేశారు. బాధితులు అందుబాటులో లేకపోవడం వల్లే ఫిర్యాదులు అందాయని, ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ రోజులు ఊరు వెళ్లేటప్పుడు పోలీసులకు లేదా ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వడంతో పాటు ఇళ్ల వద్దే సి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.