prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 10:55 am Digital Edition : PRAJA VANI

యూపీఐ చార్జీలను ఉపసంహరించుకోవాలి

యూపీఐ చార్జీలను ఉపసంహరించుకోవాలి

సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్

బెజ్జంకి, సెప్టెంబర్ 25 (ప్రజావాణి)

యూపీఐ చెల్లింపులపై కొత్తగా వ్యాపారి రుసుము (ఎండీఆర్) విధానాన్ని తీసుకురావడాన్ని సిద్దిపేట జిల్లా సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ వ్యతిరేకించారు. యూపీఐ చార్జీలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూపీఐ సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు, కార్మికులు, యువత, విద్యార్థుల రోజువారీ జీవితంలో కీలకంగా మారిందన్నారు. కొత్త రుసుముల వల్ల చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న యువతపై పరోక్ష ఆర్థిక భారం పడకుండా చూడాలన్నారు. వ్యాపారులపై విధించే రుసుమును వినియోగదారులపై అదనపు భారంగా బదిలీ చేయకూడదని సూచించారు. యూపీఐ రుసుముల విధానం, భవిష్యత్ మార్పులపై ప్రభుత్వం పూర్తి వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని కోరారు. ప్రజల డిజిటల్ చెల్లింపులు ప్రజా ప్రయోజనాల కోసమే ఉండాలని రూపేష్ పిలుపునిచ్చారు.