యువతను నట్టేట ముంచిన కూటమి సర్కార్ – భవిష్యత్ అంధకారంలోకి నెట్టారు..
9.9 శాతం యువత మహిళలూ,రోడ్డున పడ్డారు
డీఎస్సీలో జరిగిన స్కాం పై సీబీఐ విచారణ చేయలి..
ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదు పర్వం – భయపడేది లేదు,
వైయస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు
పలాస ప్రజావాణి ప్రతినిధి
రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న తీవ్ర నిరుద్యోగ సమస్య, కూటమి ప్రభుత్వ డీఎస్సీలో జరిగిన భారీ స్కాం పై వైయస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు బుధవారం పలాసలోని వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసారు.
కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో 15 నుంచి 29 ఏళ్ల వయస్సు గల యువతలో నిరుద్యోగ రేటు 9.9 శాతంగా ఉందని, అంటే దాదాపు పది మందిలో ఒకరు ఉద్యోగం లేకుండా రోడ్డున పడ్డారని, అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో 8.2 శాతం ఉంటే పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని, పట్టణ పురుషుల్లో 11.8 శాతం, పట్టణ మహిళల్లో ఏకంగా 18.9 శాతం నిరుద్యోగం ఉందని, అంటే చదువుకున్న మహిళలు, డిగ్రీలు, పీజీలు చేసిన యువతులు కూడా ఉద్యోగాలు లేక ఇళ్లకే పరిమితం అవుతున్నారని, ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని అన్నారు, 2014 ఎన్నికల్లో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో ఆ హామీని పూర్తిగా విస్మరించిందని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే 30 లక్షలకు పైగా పోస్టులు, రైల్వే శాఖలో 2.5 లక్షలు, బ్యాంకుల్లో 2 లక్షలు, పోస్టల్, డిఫెన్స్ తదితర శాఖల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని, ఉన్న ఉద్యోగాలను కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, తాత్కాలిక ప్రాతిపదికన నింపుతూ యువతను దోచుకుంటున్నారని, దీంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని అన్నారు, అంతేకాకుండా నిరుద్యోగం పెరగడానికి అనేక అదనపు కారణాలు ఉన్నాయని ఆయన వివరించారు, మొదటిది డిగ్రీలకు, నైపుణ్యాలకు మధ్య భారీ అంతరం ఉందని, లక్షలాది మంది ప్రతి ఏటా డిగ్రీలు, బీటెక్ లు, ఎంబీఏలు పట్టుకుని బయటకు వస్తున్నా ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ లేకపోవడంతో ఉద్యోగాలు రావడం లేదని, స్కిల్ డెవలప్ మెంట్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, రెండవది ప్రైవేట్ రంగంలో లేఆఫ్స్ తో యువత విలవిలలాడుతోందని, ఐటీ, తయారీ, స్టార్టప్ రంగాల్లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, కొత్త నియామకాలు లేక నిరుద్యోగం మరింత పెరుగుతోందని, మూడవది పెట్టుబడులు, పరిశ్రమలు లేకపోవడం అని, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వెనుకబడటంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని, నాలుగవది పోటీ పరీక్షల్లో జాప్యం, అవకతవకలు అని, ఎస్ఎస్సీ, యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు సకాలంలో రాక, వచ్చినా కోర్టు కేసులు, లీకేజీలు, సర్వర్ సమస్యలతో యువత ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని, దీంతో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేసి కూడా ఉద్యోగం రాక అప్పుల పాలవుతున్నారని అన్నారు, ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువతను పూర్తిగా మోసం చేసిందని దుర్యోధనరావు ధ్వజమెత్తారు, ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఏటా మెగా డీఎస్సీ నిర్వహిస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ భృతి 3 వేలు ఇస్తామని, విదేశీ విద్య, స్కిల్ యూనివర్సిటీలు అంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో 2 లక్షల 10 వేలకు పైగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, సచివాలయ వ్యవస్థ ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలు, ఆర్టీసీ విలీనం, 6 వేలకు పైగా వైద్యుల నియామకం వంటి చారిత్రక నిర్ణయాలతో యువతకు భరోసా ఇస్తే, ఈ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగా ఇవ్వలేకపోయిందని, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలోనే పెద్ద స్కాం జరిగిందని ఆరోపించారు, ప్రశ్నాపత్రాల లీక్, ఒకే హాల్ లో పక్కపక్కనే కూర్చున్న అభ్యర్థులకు ఒకేలాంటి మార్కులు రావడం, సిలబస్ కు సంబంధం లేని ప్రశ్నలు, సర్వర్ డౌన్ పేరుతో అభ్యర్థులను గంటల తరబడి ఇబ్బందులకు గురి చేయడం, సాధారణీకరణ పేరుతో మార్కుల గోల్ మాల్ వంటి అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు, నిజాయితీగా పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అన్నారు, ఈ స్కాం పై ప్రశ్నించిన వైయస్ఆర్సీపీ నేతలపై, విద్యార్థి సంఘాలపై, సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులు, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారని, అయితే వైయస్ఆర్సీపీ ఎలాంటి అక్రమ కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు, ముఖ్యంగా పలాస-కాశీబుగ్గ ప్రాంత యువత పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, ఒకప్పుడు జీడీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పలాసలో నేడు జీడీ పరిశ్రమ కుదేలైందని, ప్రభుత్వ మద్దతు, రాయితీలు, మార్కెటింగ్ సౌకర్యం లేక ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని, దీంతో డిగ్రీలు, బీటెక్ లు, పీజీలు చదివిన యువత ఉద్యోగాలు లేక జీడీ పీకలు తీయాల్సిన దుస్థితి ఏర్పడిందని, లేదా బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, జగనన్న హయాంలో జీడీ రైతులకు, కార్మికులకు అండగా నిలిచి మద్దతు ధర, పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తే, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర మాజీ మంత్రి, పలాస నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ డాక్టర్ సీదిరి అప్పలరాజు నాయకత్వంలో ప్రతి అన్యాయాన్ని నిలదీస్తామని, యువత పక్షాన నిరంతరం పోరాడతామని, 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే యువతకు ఉద్యోగాల భరోసా దక్కుతుందని, పలాస జీడీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు.