*యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం*
*యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం* *అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్* సెప్టెంబర్ ప్రజావాణి: గుండ్లపోచంపల్లి: గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలో పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులు, స్థానికులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు....