యువకుడి దారుణ హత్య ఎస్సారెస్పీ కాలువ వద్ద కలకలం

యువకుడి దారుణ హత్య ఎస్సారెస్పీ కాలువ వద్ద కలకలం.... హుజురాబాద్ ప్రజావాణి సెప్టెంబర్ : 28 హుజురాబాద్ రూరల్ "హుజూరాబాద్ మండల పరిధిలోని పెద్దపాపయ్యపల్లి గ్రామ ఎస్సారెస్పీ కాలువ సమీపంలో ఆదివారం రాత్రి నెత్తురోడింది. వివాహేతర సంబంధం నెపంతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థి పక్కా స్కెచ్ వేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచి కిరాతకంగా హతమార్చాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామానికి చెందిన వడిగే రాకేశ్(32)ను, అదే గ్రామానికి చెందిన అంబరగొండ ప్రశాంత్ హత్య...