*యాదాద్రి ఫ్లైఓవర్ తొలగింపునకు గ్రీన్ సిగ్నల్…*
*మాట ఇచ్చి నెరవేరుస్తున్న బీర్ల ఐలయ్యకు స్థానికుల కృతజ్ఞతలు.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25*
యాదగిరిగుట్ట పట్టణంలో అనాలోచితంగా నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి తొలగింపునకు గ్రీన్ సిగ్నల్ రావడంతో స్థానిక దుకాణ దారులు , నివాస ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యని స్థానికులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి , శాలువాలు కప్పి తమ అభినందనలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో యాదగిరి గుట్ట ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఫ్లైఓవర్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ కారణంగా దుకాణ దారులు , నివాస ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు త్వరలో తొలగిపోతాయని ఆశా భావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవర్ సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. ఇప్పటికే బ్రిడ్జి తొలగింపునకు సంబంధించి అను మతులు , చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని చెప్పారు. వారం రోజుల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కుదింపు పనులు ప్రారంభమవు తాయని ప్రజలకు హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట అభివృద్ధి , భక్తులు , స్థానిక ప్రజలు , వ్యాపారుల సౌకర్యం కోసం అవసరమైన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని బీర్ల ఐలయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఫ్లైఓవర్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి స్థానిక దుకాణదారులు , నివాస ప్రజలు ప్రత్యేక కృతజ్ఞ తలు తెలిపారు. ఫ్లైఓవర్ కుదింపు పనులు త్వరలో ప్రారంభం కానుండటంతో తమకు ఎంతో ఉప శమనం కలుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు.