prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 12:14 pm Digital Edition : MAHESH MEDCHAL

మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు ఘన నివాళి.. సేవా సంకల్ప్ అభియాన్‌లో రక్తదాన శిబిరం

సేవా సంకల్ప్ అభియాన్‌లో రక్తదాన శిబిరం

మేడ్చల్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాగం అర్జున్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ అధ్యక్షులు ఎక్కల్‌దేవి శ్రీశైలం యాదవ్ రక్తదానం చేసి పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గౌరవరం జగన్ గౌడ్, మేడ్చల్ డివిజన్ అధ్యక్షురాలు జల్లి శైలజ, ఎల్లంపేట్ మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ శారద రాజు నాయక్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కంచుగంట మహేష్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని, యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.