*మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీనివాస నగర్ కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు*

*రూ.3,17,116కు లడ్డూ వేలం – అత్యధిక సంఖ్యలో పాల్గొన్న కాలనీ వాసులు*
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీనివాస నగర్ కాలనీలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి.సెప్టెంబర్ 26న నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస నగర్ కాలనీతో పాటు,సూర్య నగర్ కాలనీ వాసులు మహిళలు,యువతీ,యువకులు,చిన్నారులు,కాలనీ పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వినాయక నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ *మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఆర్ ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ రామన్నగారి రాఘవేందర్ గౌడ్ గారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది*.ఈ సందర్భంగా *రామన్నగారి రాఘవేందర్ గౌడ్ గారు మాట్లాడుతూ శ్రీనివాస నగర్ కాలనీలో ప్రజలు ఇంతటి ఐక్యతతో ఒకచోట చేరి ఆనందంగా పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఇదే ఐక్యత,ఉత్సాహంతో ప్రతి పండుగ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.కాలనీ వాసులకు ఏ సమస్య వచ్చినా తన వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.అనంతరం లడ్డూ వేలంలో విజేతలుగా నిలిచిన వారిని అభినందించారు*.
*శ్రీనివాస నగర్‌ను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దేందుకు కృషి*
కాలనీ వాసులు *శ్రీ సామ నరసింహ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస నగర్ కాలనీని మేడ్చల్‌లో ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.కాలనీ అభివృద్ధికి సహకరిస్తున్న శ్రీ రామన్నగారి రాఘవేందర్ గౌడ్ గారితో పాటు కాలనీ వాసులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు*.
*రూ.3,17,116కు లడ్డూ వేలం*
వినాయక లడ్డూ వేలం కార్యక్రమం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
*వేలంలో మొదటి లడ్డూను శ్రీ సత్యానంద్ శర్మ గారు రూ.1,57,116/-కు దక్కించుకున్నారు.*
*రెండవ లడ్డూను శ్రీమతి అర్చన గారు రూ.1,60,000/-కు వేలంలో దక్కించుకున్నారు.*
*రెండు లడ్డూల ద్వారా మొత్తం రూ.3,17,116/- వేలం మొత్తం నమోదైంది.*
ఈ కార్యక్రమంలో *కాలనీ పెద్దలు,మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ గారు,సాదుళ్ళ కటిక వినయ్,త్రిశూల్ యూత్ సభ్యులు పాల్గొన్నారు*. అలాగే మహిళలు,చిన్నారులు,యువతీ,యువకులు,కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.కాలనీ ప్రజల ఐక్యత,యువత సమన్వయం,పెద్దల సహకారంతో శ్రీ శ్రీనివాస నగర్ కాలనీ త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలు విజయవంతంగా ముగిశాయి.