మేడ్చల్, ఆగస్టు 31: మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎం.ఏ. మక్సూద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మైనారిటీ సెల్ చైర్మన్ ఖాజా మొయినుద్దీన్ చేతుల మీదుగా వజ్రేష్ యాదవ్ నివాసంలో అందుకున్నారు.
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు సూచించారు. మైనారిటీ వర్గాల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత మైనారిటీ సెల్‌పై ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎం.ఏ. మక్సూద్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముజీబ్, ఖయ్యూం భాయ్, యూసుఫ్ భాయ్, మజర్ భాయ్, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.