మేడ్చల్ ఆబ్కారీలో శాఖలో ‘మత్తు’ వసూలు

*మేడ్చల్ ఆబ్కారీలో ‘మత్తు’ వసూళ్లు* *లైసెన్సులు ఉన్నా లంచాల వేధింపులు.. బాధితుల ఆవేదన* *మద్యం మత్తులో బెదిరింపులు.. బయటపడ్డ డొల్లతనం* *సామాన్యుడికో చట్టం.. అధికారులకో న్యాయమా * మేడ్చల్ నేడు న్యూస్(సెప్టెంబర్ 13) మేడ్చల్ పరిధిలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. చట్టబద్ధంగా అన్ని అనుమతులు, లైసెన్సులు ఉన్నప్పటికీ కల్లు దుకాణాల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని కొందరు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రతి నెలా కార్యాలయానికి ముడుపులు సమర్పిస్తున్నప్పటికీ, నిత్యం ఎవరో ఒకరు వచ్చి డబ్బుల కోసం వేధింపులకు...