మేడినోవాలో 6.2 కిలోల భారీ అండాశయ కణితి తొలగింపు

మేడినోవాలో 6.2 కిలోల భారీ అండాశయ కణితి తొలగింపు 58 ఏళ్ల మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం మేడ్చల్: మేడ్చల్‌లోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు 58 ఏళ్ల మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి సుమారు 6.2 కిలోల బరువున్న భారీ అండాశయ కణితిని విజయవంతంగా తొలగించారు. మెదక్ జిల్లా గంధార పల్లికి చెందిన మహిళ గత మూడు నెలలుగా కడుపు ఉబ్బరం, అజీర్ణంతో బాధపడుతూ వైద్యులను సంప్రదించారు. పరీక్షలు నిర్వహించగా పొత్తికడుపులో సుమారు 32×30 సెం.మీ. పరిమాణంలో భారీ అండాశయ కణితి...