prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 4:36 pm Digital Edition : PRAJA VANI

మెగా జాబ్ మేళాకు అంజని సిమెంట్ రూ. 5 లక్షల విరాళం

మెగా జాబ్ మేళాకు అంజని సిమెంట్ రూ. 5 లక్షల విరాళం

​ చింతలపాలెం సెప్టెంబర్ 18 ( ప్రజావాణి ):
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కోదాడ నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ అంజని పోర్ట్‌లాండ్ సిమెంట్ లిమిటెడ్ రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది.
​రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఇచ్చిన పిలుపు మేరకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్. వెంకట్ రాజు నాయకత్వంలో యాజమాన్యం ఈ మొత్తాన్ని స్పాన్సర్‌షిప్ రూపంలో అందజేసింది.
​యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు తోడ్పడటంలో, సమాజ సేవలో ఏ పీ సీ ఎల్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా స్థానిక అర్హులైన నిరుద్యోగులకు వివిధ రంగాల్లో ఉద్యోగాలు లభించి, వారి ఆర్థిక పురోగతికి బాటలు పడతాయని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. భవిష్యత్తులోనూ సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు తమ సహకారం కొనసాగుతుందని యాజమాన్యం స్పష్టం చేసింది.