మృతుల కుటుంబాలకు ఓదార్పు.. అనారోగ్య బాధితులకు మనోధైర్యం
భూపాలపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మధుసూదనాచారి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సెప్టెంబర్ 30 మన ప్రజావాణి :
తెలంగాణ తొలి శాసన సభాపతి, శాసన మండలి ప్రతిపక్షనేత గౌరవ శ్రీ సిరికొండ మధుసూదనాచారి బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ఓదార్పు, మనోధైర్యం కల్పించారు.కమలాపూర్ గ్రామంలో సీనియర్ నాయకుడు మల్లేష్ సతీమణి అనారోగ్యంతో బాధపడుతుండగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఘనపురం మండలం గొల్లపల్లి గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందిన దాసరి రాజు కుటుంబాన్ని పరామర్శించారు.రేగొండ మండలం గూడేపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన పెరుమాండ్ల సుమంత్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామంలో కాలి శస్త్రచికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఎండీ షబ్బీర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.కోటంచ గ్రామంలో ఇటీవల మృతి చెందిన మోత్కురి రాజేష్ దశదిన కర్మకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామకిష్టాపూర్ వి గ్రామంలో రిటైర్డ్ సింగరేణి కార్మికుడు నాంపల్లి ఐలయ్య తండ్రి నాంపల్లి పోషాలు మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.పరకాల పట్టణంలో తన బంధువు గుగ్గిళ్ల లక్ష్మీనారాయణ మృతి చెందడంతో వారి పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో తన చిరకాల సహచరుడు మంద రాజమల్లు (చిన్నోడు) పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియల సందర్భంగా శవయాత్రలో పాల్గొని పాడె మోశారు. అదే గ్రామంలో ఇటీవల మృతి చెందిన కడివెండి పద్మ, పాలకుర్తి సాంబయ్య కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు.కాట్రపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన సంగాల గట్టుమల్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రేణుకుంట్ల లచ్చమ్మ, మాజీ సర్పంచ్ జీడిమడ్ల ప్రభాకర్ నివాసాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.అలాగే కాట్రపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు ఎలీషా ములుగు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, బాధిత కుటుంబాలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.మధుసూదనాచారి పర్యటనలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.