prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 7:12 pm Digital Edition : PRAJA VANI

మూసి కాలుష్యంపై అసెంబ్లీలో గళం విప్పిన భువనగిరి ఎమ్మేల్యే…

*మూసి కాలుష్యంపై అసెంబ్లీలో గళం విప్పిన భువనగిరి ఎమ్మేల్యే…*

*కుంభం అనిల్ కుమార్ రెడ్డి*

*యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 18 జిల్లా ప్రతినిధి*

మూసి నది కాలుష్యం , పరిశ్రమల నుంచి వెలు వడుతున్న కాలుష్యంపై భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తన గలాన్ని వినిపించారు.
మూసి నది ప్రక్షాళన పనులను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభిం చిందని , మూసి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు తీసు కుంటున్న చర్యలతో పాటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, కాలుష్యం పై కూడా ఎమ్మెల్యే సభ పతి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కొన్ని పరిశ్రమలు గ్రామాల సమీపంలో ఉండటంతో వాటి నుంచి వెలువడు తున్న కాలుష్యం , ఇతర కారణాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని , కొన్ని సందర్భా ల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల సమీపంలోని పరిశ్రమల పై తగిన పర్య వేక్షణ చేపట్టి , ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మూసి నది పరి రక్షణతో పాటు పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశం పై సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందిస్తూ , అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.