prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 2:59 pm Digital Edition : PRAJA VANI

మూగబోయిన బుద్ధ వందన గొంతు

మూగబోయిన బుద్ధ వందన గొంతు

బౌద్ధ ఉపాసకులు హరినాథ్ బౌద్ధ్‌కు దమ్మ నివాళులు: మద్దెల గిరి

కూకట్పల్లి న్యూస్ సెప్టెంబర్ 19 (ప్రజావాణి):
ప్రముఖ అంబేద్కర్‌వాది, బౌద్ధ ఉపాసకులు హరినాథ్ బౌద్ధ్ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మహాపరినిర్వాణం పొందారు. ఆయన మృతి పట్ల బౌద్ధ, అంబేద్కర్‌వాద వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా మెహదీపట్నంలోని వారి నివాసంలో వారి పార్దివ దేహం వద్ద బుద్ధ వందనం నిర్వహించి హరినాథ్ బౌద్ధ్‌కు దమ్మ నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మద్దెల గిరితో పాటు సి.ఎల్. యాదగిరి, బాపంపల్లి మహేందర్, జంగయ్య, సాయి ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. బౌద్ధ ధమ్మ ప్రచారం, అంబేద్కర్ భావజాల వ్యాప్తికి హరినాథ్ బౌద్ధ్ చేసిన కృషిని వారు కొనియాడారు.