అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు తప్పవు :
ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్
గోవిందరావుపేట(ప్రజావాణి):-
గోవిందరావుపేట మరియు వెంకటాపూర్ మండలంలోని ఆధార్ మరియు మీసేవ సెంటర్లను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ విజయ్ లతో కలిసి తనిఖీ చేశారు.
గోవిందరావుపేట మండలంలోని పస్రా , గోవిందరావుపేట, చల్వాయి మరియు వెంకటాపూర్ మండలంలోని పాలంపేట, కేశవాపూర్, నర్సాపూర్ & వెంకటాపూర్ గ్రామాలలోని మీసేవ మరియు ఆధార్ సెంటర్లలో తనిఖీలు చేసి.. దరఖాస్తు దారుల నుండి అధిక రుసుము వసూలు చేయద్దు అని ఆధార్ నిర్వాహకులను మరియు మీసేవ నిర్వాహకులను తీవ్రంగా హెచ్చరించారు.
మీసేవ కేంద్రాలను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ESD గైడ్లైన్స్ ప్రకారం మీ సేవ కేంద్రాన్ని నడపవలనని సూచించారు.
మీసేవ మరియు ఆధార్ సెంటర్లో తప్పకుండా సిటిజెన్ చాప్టర్, భూభారతి కి సంబంధించిన ఫ్లెక్సీలు, మీసేవ లోగో, మరియు తహసిల్దార్, ఈడీఎం, పరిష్కారం కాల్ సెంటర్ల యొక్క ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండవలెనని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ ఆదేశించారు.
కళ్యాణ లక్ష్మి, UDID(సదరం), బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని మరియు మీసేవ ఆపరేటర్లు ప్రజల పట్ల సున్నితంగా ఉంటూ వారికి మీసేవ సర్వీసులను మరియు ఇతర అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందించాలని ఆదేశించారు.
నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడు నుంచి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా అట్టి మీసేవ సెంటర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్ మరియు మీసేవ మరియు ఆధార్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.