ములుగులో ఘనంగా చిట్యాల ఐలమ్మ వర్ధంతి
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి ములుగులో ఘనంగా జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ దొరల పెత్తనాన్ని ఎదిరించిన తొలి వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. విసునూరు దేశ్‌ముఖ్ తన భూమిని లాక్కోవాలని చూస్తే ప్రాణాలకు తెగించి పోరాడిందని గుర్తు చేశారు. ఆమె తెగువే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిందని...