మున్సిపాలిటీ సానిటరీ విభాగంలో అవినీతి ఆరోపణలు
* గత కొద్దికాలంలో 32 లక్షల అవినీతి కుంభకోణం
* ఒక ఉద్యోగి ని డిస్మిస్ ఏడుగురిపై క్రమశిక్షణ చర్య పై నోటీసులు జారీ
* పాతమున్సిపల్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు
జమ్మికుంట సెప్టెంబర్ 17 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగంలో అవినీతి జరిగిందని గురువారం పాత మున్సిపల్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు తెలిపారుఈ కార్యక్రమంలో ఒగ్గు రమేష్ పాతకాల మౌనిక అనిల్ యాట్ల సునీత అశోక్ శ్రీపతి స్వర్ణలత నరేష్ మాట్లాడుతూ సానిటరీ విభాగంలో గత కొద్దికాలంలో 32 లక్షల అవినీతి కుంభకోణం ఒక ఉద్యోగి ని డిస్మిస్ ఏడుగురిపై క్రమశిక్షణ చర్య పై నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు రికవరీ కాలేదుఅయినప్పటికీ ఆ విభాగంలో అవినీతి కుంభకోణం ఆగడం లేదని ఇదేచ్ఛగా సంబంధిత అధికారులు అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారని అని తెలిపారు. 27 చెత్త తరలించే బండ్లు ఉన్నప్పటికీ 7 ట్రాక్టర్లు ఉంటే వాటిని సక్రమంగా ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో పనికిరాని బండ్లకు టైర్లు బిగించి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు డీజిల్ విషయం అయితేనేమి బ్లీచింగ్ పౌడర్ విషయమైతేనేమి గడ్డి మందు విషయమైతేనేమి వీటన్నిటిపై అవినీతి కి పాలు పడుతున్నారని వారు తెలిపారు ఈ విషయంపై సానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్ పై గత రెండు రోజుల క్రితం శ్రీపతి స్వర్ణలత నరేష్ లు ప్రెస్ మీట్ పెట్టగా రాత్రికి రాత్రి బయటికి తరలించినారని పేర్కొన్నారు ఈ విషయాలు ఎక్కడ బయటపడతాయో తెలియకుండా ఉండడానికి పాత మున్సిపల్ ఆఫీస్ కు తాళం వేసి ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నారు అని వారన్నారు ఈ విషయంపై గురువారం కమిషనర్ అడగగా శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్ ను పిలిపించి విషయమును తెలుసుకొని ప్రయత్నంలో రమేష్ నా ఇష్టం తాళం వేసుకుంటాను తాళం వెయ్యమని చైర్మన్ చెప్పితే వేశానని మీరు ఎవరు అడగడానికి మీపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని మమ్మల్ని బయోగ్రాంతులకు గురిచేశాడు ఈ విషయంపై కమిషనర్ మౌనం వహించాడు అని వారు తెలిపారుఈ విషయంపై సంబంధిత అధికారులకు త్వరలోనే ఫిర్యాదు చేసి సానిటరీ అవినీతి ఆరోపణలు బట్టబయలు చేస్తామని వారు తెలిపారుఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాచర్ల రాజు పొనగంటి విష్ణు ఎగిత సుజాత అశోక్ కుతాడి తిరుపతి దిడ్డి కోమలదిడ్డి రాము పాల్గొన్నారు