prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:25 pm Digital Edition : PRAJA VANI

మున్సిపల్ కార్యాలయంలో విగ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు

మున్సిపల్ కార్యాలయంలో విగ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు

* ప్రత్యేక హోమంలో అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం

* పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట సెప్టెంబర్ 17 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శ్రీ విగ్నేశ్వర స్వామి వారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక హోమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ శ్రీ విగ్నేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలతో జమ్మికుంట పట్టణ ప్రజలకు సకల విజ్ఞములు తొలగి పట్టణ ప్రజలందరూఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతోసుఖసంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా పట్టణ ప్రజలపై ఉండాలని తెలిపారు అనంతరం మున్సిపల్ కార్యాలయ కార్మిక సోదర సోదరీమణులతో కలిసి వారికి తనే స్వయంగా వడ్డించి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి కౌన్సిలర్స్,మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి,శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందులరమేష్,వేదపండితులు బ్రహ్మశ్రీ మండలేముల కపర్ధి శర్మ దుర్గా అయ్యగారు తదితరులు పాల్గొన్నారు