prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:47 pm Digital Edition : PRAJA VANI

ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి

*ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి!

*పటాన్‌చెరు పోలీసులు&ఆర్‌ సీ పురం ఎస్‌ఓటీ సంయుక్త దాడి..

*16 మంది అరెస్టు
రూ.54,900 నగదు.. 14 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం*

పటాన్‌చెరు, సెప్టెంబర్‌ 22 (ప్రజావాణి):ముత్తంగి గ్రామంలో అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పటాన్‌చెరు పోలీసులు, ఆర్‌సీ పురం ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.54,900 నగదు, 14 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 21(సోమవారం) అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ముత్తంగి గ్రామంలోని రైస్‌ మిల్లు రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పటాన్‌చెరు పోలీసులు, ఆర్‌సీ పురం ఎస్‌ఓటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని దాడి చేశారు.
ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నవీన్‌ కుమార్‌, రాకేష్‌, కుశాల్‌ రాకేష్‌ సింగ్‌, ఆకాష్‌, దీపక్‌, యాదిరెడ్డి, సాయికృష్ణ గౌడ్‌, డానియెల్‌, సాయిరామ్‌, రవీందర్‌, ప్రశాంత్‌, విట్టల్‌, దీపక్‌ కుమార్‌ మహతో, సంతోష్‌ కుమార్‌, భానుప్రకాష్‌, రాహుల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
పేకాట స్థావరం నుంచి రూ.54,900 నగదు, 14 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా ముత్తంగి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించినట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.