prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 3:51 pm Digital Edition : MAHESH MEDCHAL

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు అండ

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు అండ

లబ్ధిదారుడికి రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

శామీర్‌పేట్: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తోందని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, శామీర్‌పేట్ డివిజన్ దేవరయాంజాల్‌కు చెందిన నీరుడి ఆనంద్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును ఆయన అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పిన్నింటి ధర్మారెడ్డి, కందాళ రాము, స్థానికులు తలగామ దర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.60 వేల ఆర్థిక సాయం మంజూరు చేయించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డికి లబ్ధిదారుడు నీరుడి ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు.