prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 4:35 pm Digital Edition : PRAJA VANI

ముంబైలో తెలుగు సమాజ మిత్ర మండల్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు

ముంబైలో తెలుగు సమాజ మిత్ర మండల్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు

ఆరురోజులు పాటు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగు సమాజ మిత్ర మండలి

పలాస ప్రజావాణి ప్రతినిధి

తెలుగు సమాజ మిత్ర మండల్ ఆధ్వర్యంలో ముంబాయిలో ఘనంగా వినాయక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.సెప్టెంబర్ 14న గణపతి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో స్థాపించి, గణేష్ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆరు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, అత్యంత ఘనంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు చిన్నారులు, మహిళలు, యువత, పెద్దలు అందరూ ఉత్సాహంగా పాల్గొనేలా వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను నిర్వహించారు.గణేష్ ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమంలో భాగంగా తొలి రోజు పాటలు, నృత్యాలు, కథ చెప్పడం, వివిధ కళా ప్రదర్శనలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు పలువురు తమ ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

మరుసటి రోజు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే దీపారాధన కార్యక్రమాన్ని కూడా ఎంతో భక్తి వాతావరణంలో నిర్వహించారు.

మరో రోజునా భజన కార్యక్రమం నిర్వహించి భక్తి గీతాలతో గణపతి బప్పాను స్మరించుకున్నారు. భక్తులంతా కలిసి భజనల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
అదేవిధంగా సత్యనారాయణ స్వామి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి, అందరికీ ప్రసాద వితరణ చేశారు.చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా పాల్గొనేలా వివిధ రకాల ఆటల పోటీలు కూడా నిర్వహించారు. పిల్లలకు ప్రత్యేకంగా గేమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు పెద్దలకు కూడా ఆసక్తికరమైన ఆటలను నిర్వహించి అందరినీ ఉత్సాహపరిచారు.ఆరు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రతి కార్యక్రమంలోనూ సమాజ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు, మహిళలు, యువత, పెద్దలు అందరూ కలిసిమెలిసి కార్యక్రమాల్లో పాల్గొనడంతో వేడుకలు మరింత సందడిగా, ఆనందోత్సాహాలతో సాగాయి.తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తి, ఐక్యత, సాంస్కృతిక వైభవం, ఆనందోత్సాహాలతో సాగిన ఈ గణేష్ ఉత్సవాలు తెలుగు సమాజ సభ్యులందరికీ ఒక మధురమైన అనుభూతిని అందించాయి.
కోలాటాలు ఆడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలతో సందడి చేస్తూ భక్తిశ్రద్ధలతో గణేష్ విసర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.