*మిర్జాపూర్ లో ఘనంగా సాకలి ఐలమ్మ జయంతి.*
నస్రుల్లాబాద్ సెప్టెంబర్ 26 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల పరిధిలో మిర్జాపూర్ గ్రామంలో మూడవ వార్డు మెంబర్ సబ్సిడీ మొగులవ్వ ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు శనివారము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్సిడీ రమేష్ మాట్లాడుతూ భూమి కోసం, విముక్తి కోసం, పోరాడిన తెలంగాణ వీర నారి సాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణియమన్నారు.. ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహానికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్సిడీ రమేష్, జంగిలి హనుమాన్లు, సాకలి మహేందర్, రాములు, చింటూ, బాలయ్య, రాజయ్య గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.