మిత్రులతో కలిసి ఘనంగా వినాయక చవితి
వేడుకలు
కూకట్‌పల్లి విలేజ్ (ప్రజావాణి) సెప్టెంబర్ 15:
కూకట్‌పల్లి విలేజ్‌లో వినాయక చవితి వేడుకలను మిత్రులతో కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో గణనాథుడిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు కోరారు. వినాయకుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.