prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 8:10 pm Digital Edition : PRAJA VANI

మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం. శ్రీదేవి

*మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం. శ్రీదేవి*

ప్రజావాణి ప్రతినిధి మార్కాపురం జిల్లా సెప్టెంబర్ 28.

– మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) ఎం. శ్రీదేవిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

– ప్రస్తుతం ఏలూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్, డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఎం. శ్రీదేవిని మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు.

– తనకు మంజూరైన ఎర్న్డ్ లీవ్ పూర్తయిన అనంతరం కొత్తగా కేటాయించిన పదవిలో చేరాలని శ్రీదేవిని ప్రభుత్వం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ ఉత్తర్వులో పేర్కొన్నారు.

– అయితే డీఆర్వో ఎం. శ్రీదేవి గతంలో గిద్దలూరు, కొమరోలు మండలాల తహసీల్దార్ కూడా విధులు నిర్వహించారు.

– సంబంధిత అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని, ఆమె రిలీవ్‌, జాయినింగ్ తేదీలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.