మామునూరు విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి

*మామునూరు విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి* *తెలంగాణ తొలి అమరుడి త్యాగానికి సముచిత గౌరవం దక్కాలి - కడవెండి గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు డిమాండ్* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి): తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో తొలి అమరుడిగా నిలిచిన దొడ్డి కొమురయ్య పేరును వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పెట్టాలని కడవెండి గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కడవెండి గ్రామం ఉమ్మడి వరంగల్...