మానవత్వం చాటుకున్న మేడారం ఎస్ఐ కమలాకర్
మానవత్వం చాటుకున్న మేడారం ఎస్ఐ కమలాకర్ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) గోవిందరావుపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వరంగల్ గార్డియన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి మేడారం (నార్లాపూర్) ఎస్ఐ అచ్చ కమలాకర్ మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందజేశారు.గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఈర్ల సాంబ (80) అనే వృద్ధురాలు అంగడి రోడ్డులో నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. దీంతో ఆమె కాలు తొంటి భాగంలో తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు, ములుగు జిల్లా...