*మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం అసెంబ్లీ ముట్టడి*
• అసెంబ్లీ ముట్టడికి ముందస్తు బైండర్ నమోదు
మన సమగ్ర ప్రజావాణి జోగిపేట్ 09 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు మాజీ సర్పంచులపై ముందస్తు బైండర్ నమోదు చేసినట్లు సమాచారం.
కన్సాన్‌పల్లి గ్రామ మాజీ సర్పంచ్ మన్నేయాదగౌడ్, రోళ్లపాడు గ్రామ మాజీ సర్పంచ్ నరసింహులు, సంగిపేట గ్రామ మాజీ సర్పంచ్ యేసయ్యలపై ముందస్తు బైండర్ చేసినట్లు తెలిపారు.
మాజీ సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి, వాటికి సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.