మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యకర ప్రవర్తనను ఖండిస్తూ బీఆర్‌ఎస్‌ నిరసన

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు బెజ్జంకి, సెప్టెంబర్ 8(ప్రజావాణి) అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన అసభ్యకర ప్రవర్తనను ఖండిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బెజ్జంకి క్రాసింగ్‌ రాజీవ్‌ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.బీఆర్‌ఎస్‌ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. మహిళా ఎమ్మెల్యేల...