prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 10:59 am Digital Edition : RAJASHEKARREDDY

మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యకర ప్రవర్తనను ఖండిస్తూ బీఆర్‌ఎస్‌ నిరసన

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు

బెజ్జంకి, సెప్టెంబర్ 8(ప్రజావాణి)

అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన అసభ్యకర ప్రవర్తనను ఖండిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బెజ్జంకి క్రాసింగ్‌ రాజీవ్‌ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.బీఆర్‌ఎస్‌ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. మహిళా ఎమ్మెల్యేల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ
కార్యక్రమంలో రావుల రామకృష్ణారెడ్డి, లింగాల లక్ష్మణ్‌, కనగండ్ల తిరుపతి, రాజయ్య, ఎల శేఖర్‌బాబు, అనిల్, బాబు గాజరాజు, నరేష్, సురేష్, మొండయ్య, సంపత్ తదితర బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.