prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 12:52 pm Digital Edition : MAHESH MEDCHAL

మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రులు

*మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు*

*రెండో రోజు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెలీదే రమేష్ గుప్త*

మేడ్చల్, సెప్టెంబర్ 16: కీసరలో మహారాజ్ యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. రెండో రోజు పూజా కార్యక్రమాల్లో కీసర డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ బెలీదే రమేష్ గుప్త పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్‌ కీసర గ్రామ శాఖ అధ్యక్షులు చినింగని బాలరాజు, గోరింటి ప్రవీణ్, మహేష్, తిరుమల్, తుడుం బాలకృష్ణ, ఉదయ్, రాజు రెబెల్, అఖిల్, యశ్వంత్, తుడుం సాయి తదితరులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం కాలనీవాసులు పెద్ద సంఖ్యలో వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో కాలనీలో ఆధ్యాత్మిక, భక్తి వాతావరణం నెలకొంది. నవరాత్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు మహారాజ్ యువసేన యూత్ అసోసియేషన్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.