మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ నిర్వాకం
*తప్పుచేసి వర్కర్లపై నిందిస్తున్న
వైనం*
శిశుపాలునిల 101 తప్పులు చేస్తున్న పట్టించుకోని అధికారులు
విద్యార్థులను వంట మనుషుల్లాగా చేసి చపాతీలు చేపిస్తున్న తీరు
ఘటన జరిగినప్పుడల్లా, పై అధికారులను తప్పు తోవ పట్టిస్తున్న కిలాడి ప్రిన్సిపాల్
తొర్రూర్
సెప్టెంబర్ 30(ప్రజా వాణి)
తొర్రూరు పట్టణ కేంద్రంలో అన్నారం రోడ్డు వెళ్లే రహదారి పక్కన ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే, గురుకుల పాఠశాలలో, ప్రిన్సిపాల్ తన ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తూ, విద్యార్థులను పని మనుషుల్లాగా పని చేయిస్తూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వర్కర్లపై తోసేస్తూ తన తప్పదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఉన్నత అధికారులకు తప్పుడు సమాచారాన్ని అందిస్తూ, చిరు ఉద్యోగులను వేధిస్తున్న తీరుపై స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈనెల 28 సాయంత్రం 6 గంటలకు విద్యార్థుల చేత కట్టెలు కొట్టించి, విద్యార్థికి పన్ను విరిగి బలమైన గాయమై ప్రమాదానికి గురికాగానే, తను ఎలా తప్పించుకోవాలో మార్గాలు వెతికి, చివరికి అందులో పని చేస్తున్న వర్కర్ ని బలి పశువులు చేస్తున్న తీరుపై అధికారులు దృష్టి సారించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తన తప్పదాన్ని దాచుకోవడం కోసం పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తన గుప్పిట్లో పెట్టుకొని, వర్కర్ తప్పిదం వల్లనే జరిగిందని తన ఇష్టానుసారమైన తీర్మానాలు చేసి వర్కర్ ను సంతకం పెట్టమని, లేదంటే నిన్ను తొలగిస్తానని బెదిరిస్తూ , వాచ్మెన్ ను విధులకు రాకుండా అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ప్రిన్సిపల్ తరగతి గదులలో తిరిగి , ఈ ఘటనపై ఎవరు నిజాలు చెప్పకూడదని, విద్యార్థులను కూడా బెదిరింపులకు, గురి చేస్తున్నాడని ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. గత తొమ్మిది సంవత్సరాలుగా వాచ్ మెన్ గా పని చేస్తున్న మంగీలాలను, ప్రిన్సిపల్ నేను చెప్పినట్టు వింటే పై అధికారులతో మాట్లాడుతానని, లేదంటే నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో నిన్ను విధులకు హాజరు కానివ్వనని, వెళ్లగొట్టాడంటే అతని యొక్క వికృతి చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది. ఇంత జరుగుతున్న జిల్లాలో ఉన్నత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేయకపోవడం విశేషం.
*నన్ను ఏ కారణం చే తొలగిస్తారు సార్ బాధితుడు మంగీలాల్*
అదేవిధంగా ఆ పాఠశాలలో గేట్ వాచ్మెన్ గా పనిచేస్తున్న మంగీలాల్, ఆ ఘటనకు నాకు సంబంధం ఏమిటి సార్, అని ప్రిన్సిపాల్ ను ప్రశ్నిస్తే విద్యార్థి ప్రమాద ఘటనకు నువ్వే బాధ్యత వహించాలి అంటూ వేధిస్తూ తనను డ్యూటీకి రాకుండా అడ్డుకుంటున్నాడని, స్థానిక ఎంపీడీవో నిన్ను తొలగించమని నాకు చెప్పాడని, ప్రిన్సిపాల్ చెబుతున్నాడని ఆయన పేర్కొన్నారు., గత ఎనిమిది నెలల క్రితం కూడా తన భార్య శ్రీదేవి ని కూడా ఏ కారణం లేకుండా తొలగించి, ప్రిన్సిపల్ ఆర్ సి ఓ పై ఒకరిపై ఒకరు చెప్పుకొని విధులకు రాకుండా అడ్డుకున్నాడని గతంలో ఉన్న ఆర్సీఓకు చెప్పిన ఎలాంటి ప్రయోజనం లేదని, నూతన ఆర్ సి ఓ కూడా ఈ అంశంపై కలిసిన , ఎలాంటి ప్రయోజనం జరగలేదని,ఇప్పుడు నన్ను టార్గెట్ చేశాడని బాధితుడు మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. ఈ అంశంపై మీడియా ప్రతినిధి స్థానిక ఎంపీడీవో వెంకటేశ్వర్లను వివరణ కోరగా, నేను ఎవరిని తొలగించమని చెప్పలేదని, ఒకరిని తొలగించే అధికారం నాకు లేదని, గురుకుల పాఠశాలలో ఆహారం ఏ విధంగా పెడుతున్నారు , విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నారా లేదా పర్యవేక్షుడిగా మాత్రమే నా బాధ్యతలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పే మాటలకు ఎంపీడీవో మాటలకు ఎలాంటి పొంతన లేకపోవడం తొర్రూరు పట్టణ కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది. కావున జిల్లా కలెక్టర్ ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నిజాన్ని నెగ్గు తేల్చి ప్రిన్సిపాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.