మహబూబాబాద్ డీఈఓ ఏకైక పుత్రుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.

మహబూబాబాద్ డీఈఓ ఏకైక పుత్రుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం. కేసముద్రం సెప్టెంబర్ 03, ప్రజావాణి. ఆ ఇంట ఉన్నది ఒకే ఒక్క దీపం.. ఆ తల్లిదండ్రులకు ఆయనే సర్వస్వం.. ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో ఉన్నత చదువుల కోసం నగరానికి పంపిన ఆ కన్నవారి గుండెల్లో విధి కోలుకోలేని దెబ్బ కొట్టింది. మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సత్యనారాయణమూర్తి ఏకైక కుమారుడు వేద్ (21) హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విన్న...