మల్లారెడ్డి జన్మదిన వేడుకలు.. ఘనంగా సేవా కార్యక్రమాలు…..ఘట్కేసర్‌లో రోగులకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ.. విద్యార్థులకు అన్నదానం

ఘట్కేసర్, సెప్టెంబర్ 9: మాజీ మంత్రి, మేడ్చల్‌ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఘట్కేసర్‌ ఉమ్మడి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంఎంసీ ఘట్కేసర్‌ సర్కిల్‌ పరిధిలోని 6, 7వ డివిజన్లలో కార్యక్రమాలు కొనసాగాయి. మొదట ఘట్కేసర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎదులాబాద్‌ సాంఘిక సంక్షేమ పాఠశాలలో, మైసమ్మగుట్ట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్‌...