ఘట్కేసర్, సెప్టెంబర్ 9: మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఘట్కేసర్ ఉమ్మడి మండల బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంఎంసీ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని 6, 7వ డివిజన్లలో కార్యక్రమాలు కొనసాగాయి.
మొదట ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎదులాబాద్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో, మైసమ్మగుట్ట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్‌రెడ్డి, మాజీ సహకార సంఘం చైర్మన్లు సారా శ్రీనివాస్‌గౌడ్, దొంకిని భిక్షపతిగౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ వార్డు సభ్యులు, మాజీ డైరెక్టర్లు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
