prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:42 pm Digital Edition : PRAJA VANI

మల్లారెడ్డిగూడలో ఘనంగా వినాయక నిమజ్జనం

*మల్లారెడ్డిగూడలో ఘనంగా వినాయక నిమజ్జనం*

*మహిళల కోలాటాలు.. ఉట్టి కొట్టే కార్యక్రమంతో సందడి*

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 ప్రజావాణి

మల్లారెడ్డిగూడ గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. యువత, చిన్నారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళల కోలాటాలు, భక్తుల సందడితో నిమజ్జన కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్నారు.పరిగి శేఖర్ గౌడ్ మల్లారెడ్డి గూడా మాజీ సర్పంచ్ పరిగి శివ లీలగణేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మల్లారెడ్డి గూడా కురుమ సంఘం అధ్యక్షులు రంగం ఆంజనేయులు సాంబార్ మండలశ్రీవాణి భజన మండల ఉపాధ్యక్షులు రాపోల్ సత్యనారాయణ మాజీ ఉపసర్పంచ్లు వెంకటయ్య రంగం శ్రీనివాస్ వార్డ్ మెంబర్ పేదోడి జంగయ్య రంగం జ్యోతి శ్రీకాంత్ రాపోలు రాజేందర్ అమీర్పేట రాఘవరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఉదయ్ శ్రీకాంత్ గౌడ్ ఉదయ్ కిరణ్ సాయి గోపాల్ ఆదర్శం మందుల వెంకటయ్య శ్రీనివాస్ రెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు