prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 7:26 am Digital Edition : PRAJA VANI

మల్కాజ్‌గిరి కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

మల్కాజ్‌గిరి కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డికి వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్

జవహర్ నగర్, సెప్టెంబర్ 26 ( ప్రజావాణి ప్రతినిధి)

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, ఘట్కేసర్ సర్కిల్‌లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ శనివారం మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

బోడుప్పల్, ఘట్కేసర్ సర్కిళ్ల పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, రహదారులు, డ్రైనేజీ, పార్కులు, పారిశుధ్యం, ఓపెన్ జిమ్‌లు తదితర అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేయాలని ఆయన కమిషనర్‌ను కోరారు.

ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో కొత్త అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు కేటాయించాలని వజ్రెష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులకు అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని వజ్రెష్ యాదవ్ తెలిపారు.

ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామల అమర్, మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, ఘట్కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమయ్య యాదవ్, మాజీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, విశ్వనాథం, ఉదయ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.