మర్రిపెళ్లిగూడెం లో రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగింపు
ప్రజావాణి సెప్టెంబర్ 23 కమలాపూర్ మండలం మర్రి పెళ్లిగూడెం నుండి కమలాపూర్ ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రమాదకరంగా రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను బుధవారం గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి సర్పంచ్ కదుర్ కవిత – తిరుపతి ఆధ్వర్యంలో వంగపల్లి బార్డర్ నుంచి మర్రిపల్లిగూడెం వరకు గుండేడు బార్డర్ నుండి మర్రిపల్లిగూడెం వరకు గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి రోడ్డుకు అడ్డుగా ఉన్న ప్రమాదకరంగా ఉన్నటువంటి చెట్టు కొమ్మలను తొలగించడం జరిగింది

ఈ సందర్భంగా మర్రిపల్లిగూడెం సర్పంచ్ మాట్లాడుతూ రోడ్డు పై వచ్చే రాకపోకలకు అడ్డుగా ఉన్నందున ప్రయాణికులకు ఇబ్బందులకు గురి అవుతున్నారని మరియు ప్రమాదాలు జరుగుతున్నాయని అడ్డుగా ఉన్నటువంటి చెట్టు కొమ్మలను తొలగిస్తున్నామని స్పష్టం చేశారు