prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:49 pm Digital Edition : PRAJA VANI

మర్మాముల రుద్రమదేవి వివో సంఘం అధ్యక్షురాలుగా గాజుల అనిత

మర్మాముల రుద్రమదేవి వివో సంఘం అధ్యక్షురాలుగా గాజుల అనిత

మద్దూరు సెప్టెంబర్ 28, ప్రజా వాణి,

మండలంలోని మర్మాముల గ్రామ రుద్రమదేవి వివో సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ హాజరై సమావేశంలోని అజెండా నూతన కార్యవర్గ ఏర్పాటుకు సహకరించారు.ఈ సందర్భంగా నూతనంగా వివో సంఘం ఎన్నిక నిర్వహించుకున్నారు.అధ్యక్షురా లుగా గాజుల అనిత, కార్యదర్శిగా ఇద్దగిరి భాగ్యమ్మ , కోశాధికారిగా గుర్రం కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నిక కాబడిన వారికి గ్రామ సర్పంచ్ శుభాకాంక్షలు తెలిపారు. సంఘ సమావేశానికి హాజరైనటువంటి సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్ ఉప సర్పంచ్ బత్తిని సిద్దులు, రుద్రమదేవి సంఘం సిఏ బత్తిని నీరజ మరియు మహిళా సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు హాజరయ్యారు.