prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 1:55 pm Digital Edition : PRAJA VANI

మర్మాముల గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చి దిద్దుదాం

మర్మాముల గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చి దిద్దుదాం

గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్

మద్దూరు సెప్టెంబర్ 27, ప్రజా వాణి,

మండలంలోని మర్మాముల గ్రామంలో చదువు రాని 14 నుండి 60 సంవత్సరాల లోపు వారికి అక్షరాస్యత కల్పించే ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా మర్మాముల గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై పరీక్షలు రాస్తున్నవారికి ప్రశ్నాపత్రాలు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల వారికి పరీక్షలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం. చదువుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని మన మహిళా సంఘాల సభ్యులు నిరూపిస్తున్నారు.
అక్షరాలు నేర్చుకోవడం అంటే కేవలం పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే కాదు. మన పేరు మనమే రాయడం, ఒక పత్రాన్ని మనమే చదవడం, బ్యాంకు లావాదేవీలు అర్థం చేసుకోవడం, ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవడం వంటి అనేక విషయాల్లో స్వావలంబన సాధించడం.
మన గ్రామంలోని ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారేలా గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నాను. ఈ రోజు పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు.
“చదువుకు వయస్సు లేదు – అక్షరాస్యతతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
మన గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన గ్రామంగా తీర్చిదిద్దుదాం. ఈ కార్యక్రమంలో ఉల్లాస్ పరీక్షల నిర్వహణకు ఇన్చార్జిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కామిడీ శ్రీనివాస్ రెడ్డి, వివో సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ప్రేమలత, పుష్ప,రేణుక, మహిళా సంఘాల సీఏలు వసంత, నీరజ మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు.