మన హృదయం…… మన బాధ్యత
రేబర్తిలో ఘనంగా ప్రపంచ హృదయ దినోత్సవం
గ్రామ సర్పంచ్ నిరాటి శ్రీనివాస్
మద్దూరు సెప్టెంబర్ 29, ప్రజా వాణి,
మండలంలోని రేబర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ నిరాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గుండె జబ్బులపై ప్రజలు అవగాహన కలిగి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అదే విధంగా ప్రతి రోజు కొంత సేపు నడక వ్యాయామం ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం మంచిదన్నారు. దీంతో పాటు ఉప్పు, అధిక కొవ్వు పదార్థాలు తగ్గించడం, ధూమపానం, పొగాకు లాంటి పదార్థాలకు దూరంగా ఉండడం, రక్త పోటు, షుగర్, కొలెస్ట్రాల్ క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవాలన్నారు. మన గుండెను కాపాడుకుందాం…ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్, జి పి ఓ,జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పుల్లూరి రాజు, ఆశా కార్యకర్తలు,గ్రామస్థులు,మహిళలు,యువకులు పాల్గొన్నారు.