*మన సమగ్ర ప్రజావాణి వార్తకు స్పందన – చండూర్ వాటర్ ట్యాంక్ సెంటర్ లో కృష్ణా వాటర్ లీకేజీ కి మరమ్మతులు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
చండూర్ పట్టణంలోని వాటర్ ట్యాంక్ సెంటర్ లో గత మూడు నెలలుగా కృష్ణా వాటర్ పైప్ లైన్ లీకేజీ అయి మురికి నీటిలో కృష్ణమ్మ నీరు కలిసిపోతుందని, దోమల బెడదతో డెంగ్యూ, విష జ్వరాల భయంతో ప్రజలు వణికిపోతున్నారని మన సమగ్ర ప్రజావాణి పత్రికలో వార్త ప్రచురించిన సంగతి తెలిసిందే. మన సమగ్ర ప్రజావాణి పత్రికలో వార్త రావడంతో కృష్ణా వాటర్ అధికారులు, చండూర్ మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించారు. హుటాహుటిన సిబ్బందిని పంపి లీకేజీని అరికట్టేందుకు మరమ్మతు పనులు చేపట్టారు. మూడు నెలలుగా పట్టించుకోని అధికారులు పత్రికలో వార్త రాగానే స్పందించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మన సమగ్ర ప్రజావాణి పత్రిక ప్రజల పక్షాన నిలబడి సమస్యను వెలుగులోకి తెచ్చిందని ప్రశంసిస్తున్నారు. అయితే తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, పైప్ లైన్ మొత్తం మార్చి ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.