prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 4:15 pm Digital Edition : PRAJA VANI

మన అంగన్‌వాడీ – మన బాధ్యత

“మన అంగన్‌వాడీ – మన బాధ్యత” అనే ప్రధాన ఇతివృత్తంతో అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడుతున్నాయి.
ఈ పోషణ్ మాసం కార్యక్రమాల్లో భాగంగా, సెప్టెంబర్ 22, 2026 (మంగళవారం) రోజున *దండేపల్లి : గూడెం: బిక్కాని గూడ* అంగన్వాడి సెంటర్ లో అన్ని గ్రామాలు మరియు వార్డు స్థాయిలలో పిల్లలకు పోషకాహారం మరియు సరైన ఆహార అలవాట్లు అందించడంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
ముఖ్య కార్యక్రమాలు:
* స్థానిక ఆహార పదార్థాలతో రుచికరమైన వంటకాల తయారీ: స్థానికంగా అందుబాటులో ఉండే పోషకాలు, ప్రోటీన్లు కలిగిన ఆహార ధాన్యాలు మరియు కూరగాయలతో ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలను వండించడం, ప్రదర్శించడం జరుగుతుంది.
* ప్రముఖుల భాగస్వామ్యం & వంటల ప్రదర్శన: స్థానిక ప్రముఖులు, చెఫ్‌లు లేదా గ్రామస్థులను భాగస్వామ్యం చేసి, ఆరోగ్యకరమైన వంటకాలను ప్రత్యక్షంగా తయారు చేసి చూపించే కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆహారంలో వైవిధ్యం పెంచడం మరియు పిల్లల ఎదుగుదలకు అత్యంత అవసరమైన ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల ప్రాముఖ్యతపై విస్తృత స్థాయి అవగాహన చేయడం జరిగింది
ఈ కార్యక్రమాలను మహిళా మరియు శిశు సంక్షేమ శాఖతో పాటు ఆరోగ్య, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా శాఖ వంటి సంబంధిత శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు మరియు గ్రామ ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని పోషకాహార అవగాహనను పెంపొందించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ మమత సర్పంచ్ మహేష్,ఉప సర్పంచ్ ఆడాయి బిక్కు, పంచాయతీ సెక్రటరీ రామ్ సాగర్ వార్డు మెంబర్ సంపత్,అంగన్వాడీ టీచర్స్ ఉమ, కమల,జయసుధ, గంగూబాయి, లక్ష్మీ ఆయా సతవ్వ తల్లులు, పిల్లలు కిశోర బాలికలు పాల్గొన్నారు.