. పస్రా సెక్టార్‌లో పోషణ మాసం సంబరాలు.
*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పస్రా సెక్టార్ పరిధిలోని వడ్డెరగూడెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డి డబ్యూఓ ప్రేమలత హాజరై తల్లులను ఉద్దేశించి మాట్లాడారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, ఇంట్లో తయారు చేసిన ఆహారమే పిల్లలకు పెట్టాలని సూచించారు. పిల్లలకు స్నాక్స్, బిస్కెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటివి ఇవ్వకూడదని, తల్లులు ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేసి ఇవ్వాలని తెలిపారు.
మూడు సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డను అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని, కేంద్రంలో ఇస్తున్న పౌష్టికాహారం, ఒక్కపూట భోజనం, పాలు, గుడ్లు, బాలామృతం తీసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. SAM, MAM పిల్లలకు బాలామృతం ప్లస్ తప్పకుండా తినిపించాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రాన్ని ‘మన అంగన్వాడీ – మన బాధ్యత గా భావించాలని, సరైన పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ శారద, అంగన్వాడీ టీచర్లు భాగ్యమ్మ, పద్మరాణి, పద్మావతి, సరిత, మహిళా సాధికారిక జెండర్ స్పెషలిస్ట్ స్వప్న, ఆయా కల్పన, ఆశా వర్కర్ రమణమ్మ మరియు తల్లులు పాల్గొన్నారు.